calender_icon.png 13 November, 2025 | 6:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాయిబాబా దేవాలయంలో అన్నదానం...

13-11-2025 04:59:27 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ పట్టణంలోని స్వప్న కాలనీలో గల సాయిబాబా ఆలయంలో కార్తీక మాసం చివరి గురువారం పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. అంతకుముందు సాయిబాబా వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. గాంధీనగర్ కు చెందిన ఎల్లే సమ్మయ్య సరోజన వారి కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సాయిబాబా నిర్వాహ కమిటీ సభ్యులు జూలూరు అశోక్, ఏ ల్లంకి వైకుంఠం, సిరిపురం రమేష్, రాజేశం దంపతులు, తుమ్మ రాజ్ కుమార్, శెట్టి శ్రీనివాస్, రవి కంటి భూమయ్య(కాంట్రాక్టర్). ధర్మేందర్, సురేష్, సాయిబాబా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.