calender_icon.png 13 November, 2025 | 6:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాణ్యతతో కూడిన బొగ్గు ఉత్పత్తికి కృషి చేయాలి

13-11-2025 04:57:09 PM

సింగరేణి ఏరియా జిఎం రాధాకృష్ణ..

మందమర్రి (విజయక్రాంతి): ప్రస్తుత పోటీ ప్రపంచంలో సింగరేణి సంస్థలు నాణ్యతతో కూడిన బొగ్గు ఉత్పత్తికి ఉద్యోగులు అధికారులు కృషి చేయాలని సింగరేణి ఏరియా జిఎం ఎన్ రాధాకృష్ణ కోరారు. జిఎం కార్యాలయంలో ఈ నెల19 వరకు నిర్వహించ నున్న బొగ్గు నాణ్యత వారోత్సవాలను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. బొగ్గు నాణ్యత వారోత్సవాలను పురస్కరించుకొని నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి సాధనకు మన వంతుగా కృషి చేయాలన్నారు. సింగరేణి సంస్థ ఉత్పత్తి, రవాణాతో పాటు అన్ని రంగాలలో కొత్త రికార్డులు సృష్టిస్తూ ముందుకు సాగుతుందన్నారు.

ప్రస్తుత పోటీ మార్కెట్లో ఇతర బొగ్గు సంస్థలకు దీటుగా సింగరేణి సంస్థ తన బొగ్గు నాణ్యత ప్రమాణాలను మరింతగా పెంచుకోవాల్సిన అవసరం ఉందని, విద్యుత్ సంస్థల పురోగతి సింగరేణి సరఫరా చేసే నాణ్యమైన బొగ్గు పైనే ఆధారపడి ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని నాణ్యమైన బొగ్గు ఉత్పత్తికి ప్రతి సింగరేణియుడు తనవంతుగా కృషి చేయాలని అంతే కాకుండా నాణ్యమైన బొగ్గును సరఫరా చేయడంలో సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్, సీఎంఓఏఐ జాయింట్ సెక్రటరీ రవి, ఇన్చార్జి పర్సనల్ మేనేజర్ ఆసిఫ్, క్వాలిటీ మేనేజర్ ప్రదీప్, సీనియర్ పిఓ శంకర్, జిఎం కార్యాలయం ఉన్నత అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.