1 August, 2026 | 4:26 PM

Breaking News

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపర్చాలి   •   రిఫీలింగ్ సెంటర్లపై దాడి.. 16 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం   •   అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలి   •   విద్యార్థులకు అండగా నిలబడడమే 'యూత్ ఫర్ సేవ' లక్ష్యం   •   కోనరావుపేట మండలంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీల ఏర్పాటు   •   ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జయప్రదం చేయండి   •   తల్లిపాల వారోత్సవాలు   •   బాచ్‌పన్ ఏహెచ్‌పీఎస్ ప్రైమరీ, బీరంగూడలో ఫ్యాన్సీ డ్రస్ పోటీలు   •   మండల సాధారణ సర్వసభ్య సమావేశంలో సమయపాలన పాటించని సర్పంచులు, అధికారులు   •   జనగామను సందర్శించిన హైకోర్టు జడ్జి సూరేపల్లి నందా   •  

వృద్ధుల ఆశ్రమంలో అన్నదానం

16-06-2026 12:12 AM

అలంపూర్, జూన్ 15: గద్వాల జిల్లా అలంపూర్ తాలూకా చిరంజీవి యువత ఆధ్వర్యంలో అల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు రవణం స్వామినాయుడు పురస్కరించుకుని సోమవారం కర్నూలులోని వృద్ధుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

తాలూకా అధ్యక్షులు జి. శివరామయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ చైర్మన్, మాజీ జడ్పీ కో-ఆప్షన్ సభ్యులు యండీ నిషాక్ ముఖ్య అతిథిగా పాల్గొని వృద్ధులకు స్వయంగా అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి వేసిన సేవా స్ఫూర్తి బాటలోనే తామంతా నడుస్తున్నామని మానవ సేవే మాధవ సేవ అని, వృద్ధుల సేవ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఆశ్రమంలోని వృద్ధులు నిర్వాహకులను ఆశీర్వదిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో మెగా అభిమానులు, ఆశ్రమ సిబ్బంది పాల్గొన్నారు.