వయోవృద్ధుల వేధింపుల నివారణ అందరి బాధ్యత
న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఇందిరా
నవాబ్పేట, జూన్ 15: రోజురోజుకూ పెరుగుతున్న వయోవృద్ధుల వేధింపుల నివారణకు కుటుంబ సభ్యులు, ప్రభుత్వం, మరియు సమాజం సమిష్టిగా కృషి చేయాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఇందిరా మేడం పిలుపునిచ్చారు. జూన్ 15 ప్రపంచ వయోవృద్ధుల వేధింపుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని, నవాబ్పేట మండల సీనియర్ సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
సమాజంలో వృద్ధులపై జరుగుతున్న మానసిక, శారీరక వేధింపులను అరికట్టడం అనివార్యమని ఇందిరా మేడం స్పష్టం చేశారు. వారి హక్కులను కాపాడటంలో చట్టాలతో పాటు సామాజిక బాధ్యత కూడా ఎంతో కీలకమని ఆమె పేర్కొన్నారు. జిల్లా సీనియర్ సిటిజన్ ఫోరం ప్రధాన కార్యదర్శి నస్కంటి నాగభూషణం, మండల సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు చేగుళ్లపల్లి నరసింహులు, కార్యదర్శి ంకటేశ్వర అప్ప, మాజీ జెడ్పీటీసీ ఇందిరా దేవి, ఫోరం ఉపాధ్యక్షురాలు సరస్వతి మేడం, కార్యనిర్వాహక కార్యదర్శి గున్నాల పండరినాథ్, కే. వేణునాథం, ఎస్త్స్ర నరేందర్, ఆర్‌ఐ. గాయత్రి పాల్గొన్నారు.






