కరీంనగర్‌లో మినిస్టర్ వైట్ స్టోర్
తెలంగాణలో 9వ ప్రత్యేక షోరూం
హైదరాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): ప్రీమియం ఎథ్నిక్ మెన్స్‌వేర్ బ్రాండ్ మినిస్టర్ వైట్ క్లోతింగ్ (ఒట్టో క్లోతింగ్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్) కరీంనగర్‌లో తన నూతన షోరూంను ప్రారంభించింది. ఈ ప్రారంభంతో దేశవ్యాప్తంగా మినిస్టర్ వైట్ స్టోర్ల సంఖ్య 64కు, తెలంగాణలో 9కు చేరుకుంది.
ఈ షోరూంను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, సురేష్ రామసుబ్రమణ్యం, చీఫ్ బిజినెస్ ఆఫీసర్, మినిస్టర్ వైట్ క్లోతింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సురేష్ రామసుబ్రమణ్యం మాట్లాడుతూ.. ‘కరీంనగర్లో మా కొత్త షోరూమ్ ప్రారంభం మినిస్టర్ వైట్ అభివృద్ధి ప్రయాణంలో మరో ముఖ్యమైన మైలురాయి. దేశంలో 64వ స్టోర్గా, తెలంగాణలో 9వ స్టోర్గా ప్రారంభమవుతున్న ఈ షోరూమ్ మా వినియోగదారులు చూపుతున్న విశ్వాసానికి నిదర్శనం’ అన్నారు.






