4 June, 2026 | 2:54 PM

వృద్ధులకు అన్నదానం

04-06-2026 01:54 PM

నిర్మల్ జూన్ 4 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని సాగర్ కాలనీలో గల డోవ్ వృద్ధాశ్రమంలో బుధవార్ పేటకు చెందిన చందుల ఆశన్న మొదటి వర్ధంతిని పురస్కరించుకొని అన్నదానం చేపట్టారు. ఈ సందర్భంగా చందుల ఆశన్న చిత్రపటానికి పూలమాలలు వేసి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఆశ్రమ నిర్వాహకులు మాట్లాడుతూ ఆశ్రమాల్లో ఉంటున్న వృద్ధుల కోసం అన్నదానాలు చేయడం ఎంతో పుణ్యమని పేర్కొన్నారు. అన్నదానం చేసిన వారి కుమారుడు చందుల సాయన్న కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమ నిర్వాహకులు రాము, సిబ్బంది పాల్గొన్నారు.