నేషనల్ క్రికెట్ లీగ్‌కు గిరిజన యువకుడు.. శ్రీ చంద్ నాయక్ ఎంపిక
ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలంలోని మారుమూల గ్రామమైన బాబాపూర్‌కు చెందిన గిరిజన యువకుడు బాదావత్ శ్రీ చంద్ నాయక్ నేషనల్ క్రికెట్ లీగ్‌కు ఎంపికై జిల్లాకు గర్వకారణంగా నిలిచాడు.
తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన అండర్-16 క్రికెట్ క్రీడాకారుల కోసం హైదరాబాద్‌లోని సెంచూరియన్ మైదానంలో మూడు రోజుల పాటు నిర్వహించిన సెలక్షన్ పోటీల్లో శ్రీ చంద్ నాయక్ తన ప్రతిభను చాటాడు.బాదావత్ శివప్రసాద్ – రజిత దంపతుల చిన్న కుమారుడు శ్రీ చంద్ నాయక్ చిన్న గ్రామం నుంచి జాతీయ స్థాయి క్రికెట్ లీగ్‌కు ఎంపిక కావడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. శ్రీ చంద్ నాయక్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి గ్రామానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని గ్రామ పెద్దలు, యువకులు ఆకాంక్షించారు.






