21 March, 2026 | 1:43 PM

Breaking News

ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం   •   జీవన్ రెడ్డికి బుజ్జగింపులు.. తన నిర్ణయంలో మార్పులేదన్న సీనియర్ నేత   •   తస్మాత్ జాగ్రత్త.. సమోసా, పఫ్స్ ప్రియులకు షాకింగ్ సీన్   •   రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం, డిప్యూటీ సీఎం   •   'శ్రమ మాది.. శిలాఫలకాలు మీవి'.. రిబ్బన్ కటింగ్ చేయడమే కాంగ్రెస్ పని   •   వేరే వ్యక్తిని పెండ్లి చేసుకుందని.. తండ్రితో వెళ్లి మహిళపై ప్రియుడు దాడి   •   యువకుడి ప్రాణం తీసిన పెళ్లి ప్రపోజల్‌.. పండగ పూట తీవ్ర విషాదం   •   కరీంనగర్ టూటౌన్ ఎస్ఐ ఆత్మహత్య.. అనాథలుగా మారిన చిన్నారులు   •   మార్కెట్‌లోకి 14 కోట్ల బ్యారళ్ల ఇరాన్ చమురు.. అమెరికా ఆంక్షలు ఎత్తివేత   •   హార్ముజ్ జలసంధి గురించి మాకు అవసరం లేదు.. వారికి ధైర్యం లేదు   •  

సురభి వైద్య కళాశాలలో ఫుడ్ పాయిజన్

06-07-2024 12:00 AM

15మంది విద్యార్థులకు అస్వస్థత

ఆలస్యంగా వెలుగులోకి ఘటన

బయట చెబితే అడ్మిషన్ రద్దు చేస్తామని బెదిరింపులు

నిర్వాహకుల నిర్లక్ష్యంపై విద్యార్థుల ఆగ్రహం

సిద్దిపేట అర్బన్, జూలై 5: సిద్దిపేట అర్బన్ మండలంలోని మిట్టపల్లి గ్రామ శివారులో గల సురభి వైద్య కళాశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. విషయం బయటకు చెబితే విద్యార్థుల అడ్మిషన్ రద్దు చేస్తామని నిర్వాహకులు బెదిరించడంతో బయటకు రాలేదు. ఫుడ్ పాయిజన్‌తో 15మంది విద్యార్థులు రెండు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హాస్టల్ వంట గదిని పరిశీలించిన విద్యార్థులకు కాలం చెల్లిన నిత్యావసర సరుకులు, కుళ్లిన కూరగాయలు దర్శనమిచ్చా యి.

లక్షల్లో ఫీజు వసూలు చేస్తూ నాసిరకం కూరగాయలతో తమ జీవితాలతో చెలగాటమాడుతున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలిసిన విద్యార్థి సంఘాల నాయకులు కళాశాలను సందర్శించగా లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదు. విద్యార్థులు అస్వస్థతకు గురై రెండు రోజులు గడుస్తున్నా వారి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకపోవడం దారుణమని మండిపడ్డారు. కలెక్టర్ వెంటనే కళాశాలను సందర్శించి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సంఘాల నాయకులు కోరారు. ఈ విషయంపై కళాశాల సూపరింటెండెంట్‌ను వివరణ కోరగా తాను సెలవులో ఉన్నట్లు తెలిపారు. కళాశాల నిర్వాహకులు అందుబాటులోకి రావడం లేదు. 

20 మంది విద్యార్థులకు అస్వస్థత 

వికారాబాద్: వికారాబాద్‌సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల (అనంతగిరిపల్లి)లో శుక్రవారం 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తెల్లవారుజాము నుంచే కొందరు విద్యార్థులు వాంతులు చేసుకున్నట్లు సమాచా రం. మధ్యాహ్నం సమయానికి విద్యార్థుల సంఖ్య ఎక్కువవడంతో పాటు కొందరు కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో సిబ్బంది విద్యార్థులను వికారాబాద్ ప్రభుత్వ ఆసు పత్రికి తీసుకెళ్లారు. అస్వస్థతకు కారణం తాగునీరు లేదా ఉదయం తీసుకున్న అల్పాహారం అయి ఉండవచ్చని వైద్యు లు తెలిపారు. అందరి ఆరోగ్య పరిస్థితి మెరుగు పడడంతో వసతి గృహానికి పంపించారు.