24 August, 2026 | 11:19 PM

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

24-08-2026 10:43 PM

కొండపాక,(విజయక్రాంతి): ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ రాష్ట్ర చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సూచించారు. ఇటీవల గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాక, వర్గల్, మార్కుక్, ములుగు మండలాల కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్‌మెంట్ మండల చైర్మన్లుగా నియమితులైన చిన్ననర్సు కర్ణాకర్, మట్ట సాయి, ప్రభుదాస్, తూర్పింటి రాజు, సిద్దిపేట జిల్లా ఎస్సీ డిపార్ట్‌మెంట్ చైర్మన్ తప్పెట శంకర్, రాష్ట్ర వైస్ చైర్మన్ విజయ్ కుమార్ నేతృత్వంలో సోమవారం కవ్వంపల్లి సత్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా నూతన మండల చైర్మన్లను అభినందించిన సత్యనారాయణ.. పార్టీకి అంకితభావంతో పనిచేస్తూ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఎస్సీ వర్గాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు పార్టీ కార్యక్రమాలను మండల స్థాయిలో విస్తృతం చేయాలని అన్నారు.