18 April, 2026 | 12:29 AM

ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు

15-06-2025 12:12 AM

గోల్కొండలో కల్తీ సమోసాలు తయారీ కేంద్రం సీజ్

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 14 (విజయక్రాంతి): గోల్కొండ ఫోర్ట్ సమీపంలోని బడా బజార్‌లో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న సమోసా తయారీ కేంద్రాన్ని జీహెఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగం శనివారం సీజ్ చేసింది. స్థానికుల ఫిర్యాదులతో జీహెఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు నిర్వహించిన తనిఖీల్లో అపరిశుభ్ర వాతావ రణంలో, లైసెన్స్ లేకుండా సమోసాలు తయారు చేస్తున్నట్లు గుర్తించా రు. అనంతరం కమిషనర్ ఆదేశాలతో సీజ్ చేశారు.