16 July, 2026 | 6:14 PM

పిల్లగాడి కోసమేనా?

13-06-2024 03:42 AM

ఈ కట్టూబొట్టూ చూసి అచ్చు గుద్దినటు ్టఅచ్చ తెలుగు అమ్మాయిలా ఉందనిపిస్తుంది కదూ. అస్సలు కాదు. ఈ అందాల బొమ్మ.. హిమాచల్ ప్రదేశ్‌కి చెందిన రుహాని శర్మ. జాతీయ పురస్కారం పొందిన ‘చి.ల.సౌ.’ (2018) సినిమాతో తెలుగు తెరకు పరియమైన రుహాని తొలి సినిమాలోని తన అభినయంతో తెలుగు వారిని కట్టిపడేసింది. అటుపై ‘హిట్ ఫస్ట్‌కేస్’, ‘నూటొక్క జిల్లాల అందగాడు’ వంటి చిత్రాల్లో నటించిన ఆమె, ఆన్‌లైన్‌లోనూ చురుకుగా ఉంటుంది. తన సినిమాలు, షికార్లకి సంబంధించిన ఫొటోలు ఎప్పటి కప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫాలోవర్లకి నేత్రానందాన్ని పంచుతుంటుంది.

వస్త్రాలంకరణలో ఒక వైపు ఇప్పటి ట్రెండ్‌ని ఫాలో అవుతూ మోడ్రన్ లుక్ మెయింటెన్ చేస్తూనే అప్పుడప్పుడూ చీరకట్టుతోనూ మురిపిస్తుంది. ఆ చీర కట్టు కూడా వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలని పోలి ఉండేలా ఉండటం గమ్మత్తు. తాజాగా అచ్చ తెలుగమ్మాయిలా ముస్తాబయిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న రుహాని, వాటికి ‘ఫిదా’ సినిమాలోని ‘హేయ్ పిల్లగాడా’ పాటని జోడించింది. దాంతో సినిమా అవకాశాల కోసం ఈ రకంగా ముస్తాబవుతోందా లేక నిజంగానే ‘పిల్లగాడి’ కోసం వెతుకులాటలో ఉందా? అనే చర్చలు మొదలయ్యాయి. ఇక ఆమె సినిమాల విషయానికొస్తే..  ఈ సంవత్సరం రుహాని నటించిన ‘సైంధవ్’, ‘ఆపరేషన్ వాలంటైన్’, ‘శ్రీరంగనీతులు’ సినిమాలు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చాయి.