10 June, 2026 | 8:09 PM

అటవీ శాఖ ఆధ్వర్యంలో వనమహోత్సవం

10-06-2026 06:57 PM

నిర్మల్,(విజయ క్రాంతి): ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈరోజు అడెల్లి నందనవనం, సారంగాపూర్ మండలం నందు "వనమహోత్సవ కార్యక్రమం" ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను ప్రజలకు వివరించనైనది. వృక్షాలు మన జీవనానికి ఆధారం అని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఈ సందర్భంగా నజీర్ ఖాన్ ఉప అటవీ క్షేత్ర అధికారి అవగాహన కల్పించారు.