10 June, 2026 | 7:40 PM

గొల్లగూడలో సీసీ డ్రెయిన్ పనులకు భూమి పూజ

10-06-2026 06:55 PM

భూమి పూజ చేస్తున్న సర్పంచ్ సునీత

వాంకిడి,(విజయక్రాంతి): వాంకిడి మండలం ఖమాన గ్రామపంచాయతీ పరిధిలోని గొల్లగూడలో సీసీ డ్రెయిన్ నిర్మాణ పనులకు బుధవారం గ్రామ సర్పంచ్ సునీత భూమి పూజ చేశారు. గ్రామపంచాయతీ నిధులతో 150 మీటర్ల  డ్రెయిన్‌ను ఉడుతల కిష్టయ్య ఇంటి నుంచి పెందోర్ జలపత్ ఇంటి వరకు నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ .. గ్రామంలో పారిశుద్ధ్య పరిస్థితుల మెరుగుదలతో పాటు మురుగు నీటి సక్రమ పారుదలకు సీసీ డ్రెయిన్ ఉపయోగపడుతుందన్నారు. గ్రామాభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు గ్రామపంచాయతీ కట్టుబడి ఉందని ఆమె పేర్కొన్నారు.