10 June, 2026 | 8:08 PM

నీటి ఎద్దడి నివారణకు చర్యలు

10-06-2026 07:00 PM

ఖమాన సర్పంచ్ సునీత 

వాంకిడి,(విజయక్రాంతి): నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తుగా చర్యలు చేపడుతున్నామని, ఖమాన సర్పంచ్ సునీత తెలిపారు. వాంకిడి మండలం ఖమాన గ్రామపంచాయతీ పరిధిలోని సాలెగూడా గ్రామంలో బుధవారం నూతన బోరు వేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... గ్రామపంచాయతీ పరిధిలోని ప్రతి గ్రామంలో త్రాగు నీటి ఎద్దడి సమస్య రాకుండా చూసుకుంటున్నామని ఆమె తెలిపారు. ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.