8 July, 2026 | 2:41 AM

కొండ గొర్రె మాంసాన్ని పట్టుకున్న అటవీ అధికారులు

08-07-2026 02:03 AM

చండ్రుగొండ, జులై  07, ( విజయక్రాంతి): మండల పరిధిలోని మద్దుకూరు గ్రామంలో అటవీ అధికారుల విశ్వాసనీయ సమాచారం మేరకు మంగళవారం బూరుగు లక్ష్మీనారాయణ  మద్దుకూరు గ్రామానికి చెందిన వ్యక్తి వద్ద కొండ గొర్రె మాంసాం, తలా కాళ్లు దొరికినవి.

అతను అదుపులో తీసుకొని విచారించగా సోమవారం రాత్రి  నాటు తుపాకి, టార్చ్ లైట్, కత్తి వేట ఉపయోగించినట్లు తెలిపాడు. కొండల గొర్రె మాంసాన్ని వెటర్నరీ డాక్టర్ తో పంచనామా చేయించి భద్రపరచడం జరిగిందని, ఆ నిందితుని  కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ తనిఖీలు అటవీ క్షేత్ర అధికారి తేజస్వి, రేంజర్ మంజుల, డిప్యూటీ రేంజర్ లక్ష్మీపతి, మధుకూరు బీట్ ఆఫీసర్ రవికుమార్, అరుణ కుమారి, సిబ్బంది పాల్గొన్నారు.