వర్షం రాకతో వనభోజ నాలు
24-08-2026 | 03:28pm
బోథ్ ఆగస్టు 24 (విజయక్రాంతి): సోనాల మండలంలోని చింతల బోరి గ్రామ వాసులు సకాలంలో వర్షం కురవడంతో వనభోజనాలు చేశారు. గత వారం రోజుల నుండి వర్షాల కోసం గ్రామస్తులు ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే ఆదివారం భారీ వర్షం కురవడంతో రైతులు గ్రామ యువకులు హర్షణ వ్యక్తం చేస్తూ అడవిలో భోజనాలు చేసి వనదేవతకు, గ్రామదేవతలకు నైవేద్యాలు సమర్పించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు సర్పంచ్, ఉప సర్పంచ్ పాల్గొన్నారు.