15 June, 2026 | 2:50 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

674 బిలియన్ డాలర్లకు ఫారెక్స్ నిల్వలు

24-08-2024 12:30 AM

న్యూఢిల్లీ, ఆగస్టు 23: దేశం వద్దనున్న విదేశీ మారక నిల్వలు మళ్లీ పెరిగి రికార్డు గరిష్ఠస్థాయిని సమీపించారు.  శుక్రవారం ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకా రం  ఆగస్టు 16తో ముగిసిన వారంలో ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) రిజర్వులు 4.546 బిలియన్ డాలర్లు పెరిగి 674.664 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. ఆగస్టు తొలివారంలో రికార్డు గరిష్ఠస్థాయి 674.919 బిలియన్ డాలర్లకు చేరిన ఫారెక్స్ నిల్వలు ఆగస్టు 9తో ముగిసిన వారంలో 4.8  బిలియన్ డాలర్ల మేర  తగ్గాయి.  తాజా సమీక్షా వారంలో  విదేశీ మారక నిల్వల్లో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 3.609 బిలియన్ డాలర్లు ఎగిసి 591.569 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. అమెరికా డాలరుయేతర కరెన్సీలైన యూరో, పౌండు, యెన్ తదితర విదేశీ కరెన్సీల విలువ డాలరుతో పోలిస్తే తగ్గుదల, పెరుగుదలను కరెన్సీ ఆస్తుల లెక్కింపులో పరిగణనలోకి తీసుకుంటారు. 

బంగారం నిల్వలూ పెరిగాయ్

దేశం వద్దనున్న బంగారం నిల్వలు కూడా సమీక్షావారంలో  865 మిలియన్ డాలర్లు పెరిగి 60.104 బిలియన్ డాలర్ల స్థాయికి చేరాయి.  స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డీఆర్‌లు) 60 మిలియన్ డాలర్లు పెరిగి18.341 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. ఐఎంఎఫ్ వద్దనున్న రిజర్వులు 12 మిలియన్ డాలర్లు  పెరిగి 4.65 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి.