పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు
స్క్రీన్ ప్రజెంటేషన్ ద్వారా శ్రీనుబాబు అవగాహన
పెద్దపల్లి, జూన్ 15(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలోని శ్రీమయి కన్వెన్షన్ హాల్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బూత్ లెవెల్ ఏజెంట్ల బిఎల్ ఎ కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (Special Intensive Revision) ప్రక్రియపై ఏజెంట్లకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రామగుండం ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారులు హర్కర వేణుగోపాల్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణ రావు హాజరయ్యారు.
స్క్రీన్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన
ఈ శిక్షణ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు(TPCC State General Secretary Duddilla Srinubabu) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన SIR ప్రక్రియకు సంబంధించిన విధి విధానాలను స్క్రీన్ ప్రజెంటేషన్ ద్వారా చాలా స్పష్టంగా, క్షుణ్ణంగా వివరించారు. మంథని, రామగుండం, పెద్దపల్లి నియోజకవర్గాల నుండి హాజరైన బూత్ లెవెల్ ఏజెంట్లకు ఓటర్ల జాబితా సవరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన పద్ధతులపై ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నేతలు, బిఎల్ఎ ఇంచార్జీలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






