15 June, 2026 | 2:36 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు

15-06-2026 02:04 PM
  1. తెలంగాణ ఏర్పాటుకు జనసేన ఏనాడు అడ్డు చెప్పలేదు
  2. ఏపీని విభజించిన తీరుపై మాత్రమే ఆవేదన
  3. కాంగ్రెస్ విభజన తీరు.. అసంతృప్తి, అశాంతి
  4. కాంగ్రెస్ ధోరణి మారలేదు

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జనసేన పార్టీ ఏనాడు అడ్డు చెప్పలేదని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం భట్టి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఢిల్లీ వేదికగా జనసేన పార్టీ తలపెట్టిన సేన ప్రస్థానం, జాతీయ సమైక్యత కోసం కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.... ఏపీని విభజించిన తీరుపై మాత్రమే ఆవేదన వెలిబుచ్చామని గుర్తుచేశారు. కాంగ్రెస్ విభజన తీరు.. అసంతృత్తి, అశాంతిని సృష్టించిందని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రాన్ని విభజించిన నాటి నుంచి ఇవాళ్టికి కాంగ్రెస్ ధోరణి మారలేదని ఆరోపించారు. తెలంగాణలో జనసేన సభకు అనుమతివ్వకుండా అడ్డుకున్న పరిస్థితి, ఢిల్లీ మెడలు వంచుతాం.. తడాఖా చూపిస్తామని చాలామంది పెద్దమాటలు చెబుతున్నారని సూచించారు.వాస్తవానికి అలాంటి నేతలు ఢిల్లీకి రాగానే వెనక్కి తగ్గుతారని పవన్ కళ్యాణ్   ఎద్దేవా చేశారు.

కాక్రోచ్ పార్టీని చూస్తే.. చలిచీమల పద్యం గుర్తుకువస్తుంది: పవన్

చాలా సార్లు మనకుమనం తక్కువగా అంచనా వేసుకుంటామన్న పవన్ కళ్యాణ్ ప్రతి వ్యక్తి కూడా సమాజంలో మార్పు తేవొచ్చని సూచించారు. ఈ మధ్య కాక్రోజ్ పార్టీ ఎలా పుట్టుకొచ్చిందో చూస్తున్నామన్నారు. కాక్రోచ్ పార్టీని చూస్తే... చలిచీమల పద్యం గుర్తుకువచ్చిందని పవన్ కళ్యాన్ తెలిపారు. చలిచీమలు కూడా బలమైన పామును చంపేస్తాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ వివరించారు. ఢిల్లీలోనే సమావేశం పెట్టడానికి కారణం ఢిల్లీ చరిత్ర గొప్పతనమని పేర్కొన్నారు. జనసేన పార్టీ దేశ భక్తికి ఎంత విలువ ఇస్తుందన్నది చెప్పాలన్నదే ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.