16 May, 2026 | 5:09 PM

కమిటీ ఏర్పాటు చేయడం అభినందనీయం

16-05-2026 04:36 PM

భైంసా,(విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలు, సేవలను గుర్తించి వారికి తగిన గుర్తింపు కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేయడం పట్ల నిర్మల్ జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులు ఎం రామకృష్ణ గౌడ్ హర్షం వ్యక్తం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక మంది ఉద్యమకారులు చేసిన త్యాగాలు, పోరాటాలను గుర్తిస్తూ వారికి న్యాయం చేయాలనే దీర్ఘకాల డిమాండ్‌కు ఇది సానుకూల స్పందన అని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, సంబంధిత మంత్రివర్గ సభ్యులకు, కమిటీ చైర్మన్ మరియు సభ్యులకు నిర్మల్ జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కమిటీ పారదర్శకంగా పనిచేసి నిజమైన తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారికి తగిన గౌరవం, గుర్తింపు అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.