ఫార్మేషన్ రోడ్డు పనులు ప్రారంభం
గాంధారి, జూలై 16 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో ఫార్మేషన్ రోడ్డు పనులు గురువారం నాడు స్థానిక నాయకులు ప్రారంభించారు.. ఈ సందర్భంగా వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు పెద్దబూరి సాయికుమార్ మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావంతో మండలంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి అని మండల కేంద్రానికి చెందిన రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావ్ ప్రత్యేక ఉపాధి హామీ పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశించడంతో ఈ ఫార్మేషన్ రోడ్డు పనులు ప్రారంభించినట్టు తెలిపారు.. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మమ్మాయి రేణుకా యాదవ్, ఉప సర్పంచ్ భాస్కర్ గౌడ్, గ్రామ పంచాయతీ పాలక వర్గం, ఏపిఓ మధు, సాంకేతిక సహాయకుడు నారాయణ, క్షేత్ర సహాయకుడు సాయికుమార్, పలువురు నాయకులు, గ్రామ రైతులు పాల్గొన్నారు.






