calender_icon.png 18 February, 2026 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు

18-02-2026 12:41:35 AM

పెబ్బేరు పిబ్రవరి 17: పట్టణ కేంద్రంలోని మాజీ సీఎం కెసిఆర్ జన్మదిన వేడుకలను పట్టణ, మండల అధ్యక్షులు దిలీప్ రెడ్డి, వనం రాములు ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి నాయకులకు,కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర సాధకుడుగా కీర్తి గణించిన మహోన్నత వ్యక్తి కేసీఆర్ అని,

ప్రజా రైతు సంక్షేమమే లక్ష్యంగా పెట్టుకొని పాలన కొనసాగించి దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపిన మహోన్నత వ్యక్తిగా చరిత్ర సృష్టించిన వ్యక్తిగా నిలిచాడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఛైర్మెన్ కర్రె స్వామి, కౌన్సిలర్లు కరుణశ్రీసాయినాధ్, శంకర్ నాయుడు, నాయకులు వెంకటేష్, వడ్డె ఈశ్వర్, విశ్వరూపం, గోపీబాబు, సంబు రాము, సాయి రెడ్డి సహదేవుడు, గోవర్ధన్ రెడ్డి, శివశంకర్ గౌడ్, సోషల్ మీడియ కన్వీనర్ వడ్డె రమేష్, గట్టయ్య జూదం వెంకటేష్ వెంకటేష్ వీరబోజచారి, వేణు, గోవిందు నాయుడు తదితరులు పాల్గొన్నారు.