03-11-2025 12:40:45 PM
చిన్నమల్లయ్య మృతి బాధాకరం: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు
మంథని,(విజయక్రాంతి): మంథని మాజీ సర్పంచ్ ఉడ్నాల శ్రీనివాస్ తండ్రి వడ్నాల చినమల్లయ్య అనారోగ్యంతో సోమవారం ఉదయం మృతి చెందాడు. చిన్న మల్లయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవలనే చికిత్స పొంది ఇంటికి తిరిగివచ్చాడు. చిన్న మల్లయ్య బట్టల వ్యాపారంతో అంచలంచలుగా ఎదిగాడు. ఆయన మృతి పట్ల రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన మృతి చాలా బాధాకరమన్నారు. మంథని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఐలి ప్రసాద్, కిసాన్ సేల్ జిల్లా చైర్మన్ మంథని రెడ్డి సంఘం అధ్యక్షులు ముసుకుల సురేందర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ కుడుదుల వెంకన్న, యూత్ నాయకులు డిగంబర్, ప్రజా సంఘాల నాయకులు గణేష్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మంథని పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.