భారీగా ఐఏఎస్‌ల బదిలీ
- పలు కీలక శాఖల్లో మార్పులు
- 45 మందిని బదిలీచేస్తూ ఉత్తర్వులు జారీ
- జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా రాహుల్ బొజ్జా
- యువ ఐఏఎస్‌లకు వివిధ జిల్లాలకు కలెక్టర్లుగా అవకాశం
హైదరాబాద్, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్ర పాలనా యంత్రాంగంలో ప్రభుత్వం భారీ ప్రక్షాళన చేపట్టింది. పరిపాలనలో వేగం పెంచడం, ప్రభుత్వ ప్రాధాన్యతలను, సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఏకంగా 45 మంది ఐ ఏఎస్, రాష్ట్ర సివిల్ సర్వీస్ అధికారులను బదిలీచేస్తూ బుధవారం రాత్రి సంచలన ఉత్తర్వులు జారీచేసింది.
ఇందులో సచివాలయ స్థాయిలోని పలువురు సీనియర్ ఐఏఎస్‌లకు స్థానచలనం కల్పించడంతోపాటు, ఏకంగా 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించింది. రాష్ట్ర ప్రగతిలో అత్యంత కీలకమైన ఐటీ, పరిశ్రమలు, పంచాయతీరాజ్, నీటిపారుదల, ఆర్థిక శాఖల కార్యదర్శులను మార్చింది.
జీహెచ్‌ఎంసీ జోన ల్ కమిషనర్లు, పలువురు అదనపు కలెక్టర్లకు సైతం కొత్త పోస్టింగ్‌లు ఇచ్చింది. సచివాలయ స్థాయిలో కీలక శాఖల బాధ్యతలను ప్రభుత్వం పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు అప్పగించింది. అలాగే జిల్లాల వారీగా పాలనను పరుగులు తీయించేందుకు యువ ఐఏఎస్ అధికారులకు కలెక్టర్లుగా అవకాశం కల్పించింది.
బదిలీలు ఇలా..
సంజయ్ కుమార్ : పరిశ్రమలు, ఐటీ శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీ పదవి నుంచి పీఆర్‌ఆర్డీ
(పంచాయతీరాజ్), ఆర్డబ్ల్యూఎస్ శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ
ఎన్ శ్రీధర్ : ఐటీ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియామకం
సవ్యసాచి ఘోష్ : ఫ్లాగ్షిప్ వెల్ఫేర్ డెవలప్మెంట్ స్కీమ్స్ యూనిట్‌తోపాటు సీఎస్సార్ బాధ్యతలు
ఎం. దానకిషోర్ : లేబర్, ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్ ఫ్యాక్టరీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా
కొనసాగుతూ.. విపత్తు నిర్వహణ శాఖ అదనపు బాధ్యతలు
రాహుల్ బొజ్జా : సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)లో రాజకీయ వ్యవహారాల ప్రిన్సిపల్
సెక్రటరీగా బదిలీ. అలాగే బీసీ వెల్ఫేర్ శాఖ అదనపు బాధ్యతలు
ఇ శ్రీధర్ : ఇరిగేషన్ అండ్ క్యాడ్ శాఖ కార్యదర్శిగా నియామకం
గౌరవ్ ఉప్పల్ : ఫైనాన్స్ ప్లానింగ్ శాఖ కార్యదర్శిగా నియామకం.
టీజీఆర్‌ఏసీ ఈఓ డీజీగా అదనపు బాధ్యతలు
బీ విజియేంద్ర : మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ నుంచి.. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్
ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (గురుకులాలు) కార్యదర్శిగా బదిలీ
డి. దివ్య : సెర్ప్ సీఈఓగా కొనసాగుతూ.. ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా
అదనపు బాధ్యతలు
సిక్తా పట్నాయక్ : నారాయణపేట్ కలెక్టర్ నుంచి.. ఫైనాన్స్ శాఖ స్పెషల్ సెక్రటరీగా నియామకం
అద్వైత్‌కుమార్‌సింగ్ : మహబూబాబాద్ కలెక్టర్ నుంచి.. తెలంగాణ భవన్ (ఢిల్లీ)లో
సమన్వయ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియామకం
భవేష్ మిశ్రా : ఐటీ శాఖలో స్పెషల్ సెక్రటరీగా రీడిజిగ్నేషన్
జిల్లాలకు కొత్త కలెక్టర్లు వీరే..
సందీప్ కుమార్ ఝా : జనగాం జిల్లా కలెక్టర్ (గతంలో జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్)
అనురాగ్ జయంతి : యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్
(గతంలో జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్)
రిజ్వాన్ భాషా షేక్ : జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్
ప్రతీక్ జైన్ : నారాయణపేట్ జిల్లా కలెక్టర్
స్నేహ శబరీష్ : మహబూబాబాద్ జిల్లా కలెక్టర్
చిత్రా మిశ్రా : కరీంనగర్ జిల్లా కలెక్టర్ (గతంలో ఏటూరునాగారం ఐటీడీఏ పీవో)
గరిమా అగర్వాల్ : రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్
దీపక్ తివారీ : వికారాబాద్ జిల్లా కలెక్టర్
ప్రతిమా సింగ్ : మెదక్ జిల్లా కలెక్టర్
అంకిత్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్
చాహత్ బాజ్పాయ్ : హనుమకొండ జిల్లా కలెక్టర్
(జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు)
ఖుష్బూ గుప్తా : మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్
కార్పొరేషన్లు, విద్యుత్, ఇతర శాఖల్లో..
జితేష్ వీ పాటిల్ : టీజీఎస్పీడీసీఎల్ సీఎండీగా నియామకం.
ఎండీ ముషారఫ్ అలీ ఫరూఖీ : టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ నుంచి మూడో డిస్కమ్ సీఎండీగా బదిలీ
పమేలా సత్పతి : కరీంనగర్ కలెక్టర్ నుంచి కార్మిక శాఖ స్పెషల్ కమిషనర్‌గా బదిలీ
రాహుల్ రాజ్ పీఎస్ : మెదక్ కలెక్టర్ నుంచి సహకార శాఖ స్పెషల్ కమిషనర్ రిజిస్ట్రార్‌గా నియామకం
సంతోష్ బీఎం : గిరిజన సంక్షేమ శాఖ డైరెకర్ట్‌గా బదిలీ
ఎం హనుమంత రావు : యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ నుంచి
ఎండోమెంట్స్ (దేవాదాయ శాఖ) డైరెక్టర్‌గా బదిలీ
పీ కాత్యాయని దేవి : స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియామకం
శివేంద్ర ప్రతాప్ : హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియామకం
మందా మకరందు : జీహెచ్‌ఎంసీ రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్‌గా నియామకం
పర్మార్ పింకేశుకుమార్ లలితుకుమార్ : జీహెచ్‌ఎంసీ కుత్బుల్లాపూర్
జోనల్ కమిషనర్‌గా నియామకం
అదనపు కలెక్టర్లు, రాష్ట్ర సివిల్ సర్వీస్ అధికారుల బదిలీలు..
జీ ఫణీంద్ర రెడ్డి : నారాయణపేట్ అదనపు కలెక్టర్ (గతంలో టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ)
ఫైజాన్ అహ్మద్ : మేడ్చల్ మల్కాజిగిరి అదనపు కలెక్టర్
ఉమా శంకర్ ప్రసాద్ : వికారాబాద్ అదనపు కలెక్టర్
జీవీ శ్యామ్‌ప్రసాద్‌లాల్ : నాగర్‌కర్నూల్ అదనపు కలెక్టర్
పీ చంద్రయ్య : మంచిర్యాల అదనపు కలెక్టర్
వైవీ గణేష్ : వరంగల్ అదనపు కలెక్టర్
అబ్దుల్ హమీద్ : సిద్దిపేట అదనపు కలెక్టర్
బీ వెంకటేశ్వర్లు : నిర్మల్ అదనపు కలెక్టర్
ఎన్ ఖీమ్యా నాయక్ : వనపర్తి అదనపు కలెక్టర్
కే విద్యాసాగర్ : ఇండస్ట్రీ ఇన్వెస్ట్మెంట్ సెల్ అదనపు సీఈఓ
ఎం సురేందర్ : ప్రజావాణి అదనపు నోడల్ అధికారి




