03-11-2025 12:42:34 PM
							జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి
జడ్చర్ల : చేవెళ్ల మండలంలోని మీర్జాగూడ వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంపై వ్యక్తం చేసిన జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని మీర్జాగూడ వద్ద హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రమాదం పట్ల జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.ఈ ప్రమాదంలో ప్రయాణికులు మృతి చెందడం పట్ల ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని వైద్యులకు సూచించారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలని ప్రార్థించి నట్లు పేర్కొన్నారు.