calender_icon.png 3 November, 2025 | 7:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథని లో గోదావరి స్నానానికి వెళ్లిన యువకుడు గల్లంతు

03-11-2025 12:37:14 PM

మంథని,(విజయక్రాంతి): మంథని శివారులోని గోదావరి నది స్నానానికి వెళ్లిన ఓ యువకుడు గల్లంతయ్యాడు. సోమవారం ఉదయం స్నానానికి వచ్చిన యువకుడు తన వెంట తెచ్చుకున్న సంచీ, చెప్పులు, బట్టలు ఒడ్డు మీద పెట్టి గోదావరి నది స్థానాకి పోయాడు, స్నానానికి వెళ్లిన వ్యక్తి తిరిగి రాకపోవడంతో స్నానానికి వచ్చిన వారు ఒడ్డుపై ఉన్న బట్టలు చూసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే  మంథని ఎస్ఐ సాగర్, ఫైర్ అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. గల్లంతైన వ్యక్తి ఆచూకీ కొరకు గాలింపు చర్యలు చేపట్టారు. నదిలో గల్లంతైన వ్యక్తి ప్రతి రోజూ ఉదయం సైకిల్ పై గోదావరి నది స్నానానికి వస్తుంటాడని, ఈ రోజు కూడా గోదావరి నది స్నానానికి రాగా, గోదావరి దిగువకు ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో నీటి ప్రవాహంలో కొట్టుకు పోయినట్లు అనుమానిస్తున్నారు. మంథని లోని మర్రి వాడకు చెందిన రవి కంటి సాయి(30) గా  ఎస్ఐ తెలిపారు.