గడ్డపారల పాలన
- కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే ‘చేతి’లో గడ్డపార
- హైడ్రా పేరిట పేదల ఇళ్లు కూలగొడుతున్నరు
- హిల్ట్ పేరిట పరిశ్రమలను బయటకు పంపుతున్నరు
- మూసీ సుందరీకరణకు మేం వ్యతిరేకం కాదు
- కానీ పేదల ఇళ్లు కూలగొడతామంటే ఊరుకునేది లేదు
- పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం వద్ద భూములే లేవు
- ‘మూసీ గోస భరోసా’ పరామర్శ యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
హైదరాబాద్, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి) : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గడ్డపార చేతిలో పట్టుకున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా పేరిట పేదల ఇళ్లు కూలగొట్టిందని మండిపడ్డారు. ఇంకో గడ్డపార పట్టుకుని హిల్ట్ పేరిట పరిశ్రమలను బయటకు పంపిస్తుందని, ఇప్పుడు మూసీ ప్రాజెక్టు పేరిట దేశం కోసం పోరాటం చేసిన పూర్వ సైనికుల ఇళ్లను కూలగొడుతున్నదని ఆగ్ర హం వ్యక్తం చేశారు.
దీనిని బట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి దేశంపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతున్నదన్నారు. గాంధీ విగ్రహం పెట్టడంలో తమకు అభ్యంతరం లేదని, కానీ మధ్య తరగతి ప్రజల ఇళ్లు కూలగొడతామంటే ఊరుకునేది లేదని హెచ్చరిం చారు. ఈ ప్రభుత్వానికి సిగ్గు ఉంటే మూసీ ప్రాజెక్టును మార్చాలని డిమాండ్ చేశారు. ‘మూసీ గోసబీ భరోసా’ పరామర్శ యాత్ర సందర్భంగా రాంచందర్‌రావు మీడియాతో మాట్లాడారు.
మూసీ సుందరీక రణ ప్రాజెక్ట్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజ ల్లో తీవ్ర భయాందోళన సృష్టిస్తోందని, ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు చెబుతూనే, మరోవైపు స్పష్టత లేకుండా ప్రజల ను అయోమయానికి గురిచేస్తోందన్నారు. బండ్లగూడ జాగీర్ పరిధిలోని కొన్ని కాలనీలకు, ముఖ్యంగా మధు పార్క్ రిడ్జ్ అపా ర్ట్‌మెంట్ వాసులతో పాటు ఆ రెసిడెన్సీ లో సుమారు 450కు పైగా ఇళ్లకు, అలాగే విఘ్నేశ్వర కాలనీలో సుమారు 170 ఇళ్లకు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోందని చెప్పారు.
మూసీ పరివాహక ప్రాంతంలో, హైదర్‌గూడ భూములతో పాటు, మూసీకి ఆనుకుని పరీవాహక ప్రాం తాల్లో కూరగాయలు పండిస్తూ హైదరాబాద్‌కు సరఫరా చేస్తున్న రైతుల భూములను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తోందని, రైతుల భూము లను గుంజుకొని భూమిలేని వారిగా మార్చే కుట్ర స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
సుందరీకరణకు మేం వ్యతిరేకం కాదు..
మూసీ సుందరీకరణకు బీజేపీ వ్యతిరేకం కాదని, మూసీ శుద్ధికి మేం వ్యతిరేకం కాదని, ప్రజా వ్యతిరేక పాలనకే వ్యతిరేకమని స్పష్టంచేశారు. మూసీ మంచి నీటితో ప్రవహిం చా లని, దుర్వాసన రాకుండా, దోమలు లేకుం డా ఉండాలని, హైదరాబాద్ ప్రజలు గర్వ ంగా చెప్పుకునేలా మూసీ ఉండాలని ఆకాంక్షించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చే స్తున్న పనిప్రజల పక్షాన కాదని, ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక చర్య అని మండిపడ్డారు.
మధు పార్క్ రిడ్జ్ వద్ద 12 మీటర్ల బఫర్ జోన్‌లో, పూర్తిగా ప్ర భుత్వ అనుమతులతో నిర్మించిన ఇళ్లను కూడా కూల్చివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. మూసీ సుం దరీకరణ పేరుతో ఇళ్లు కూల్చాల్సిన అవసరం లేదని, మూసీకి, ఈసా నదు ల శుద్ధి కోసం సరైన ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తే స్వచ్ఛమైన నీరు వస్తుందని, రిటైనింగ్ వాల్స్ నిర్మించి, ఒక్క ఇల్లు కూల్చకుండా సుందరీకరణ చేయవచ్చని తెలిపారు.
పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం వద్ద భూములే లేవు..
కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నట్టు నిర్వాసితులకు పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వ వద్ద భూములే లేవని, ప్రభుత్వ భూములన్నీ అమ్మేశారని స్పష్టం చేశారు. రూ. 150 కోట్ల ఎకరాల భూమిని అమ్మేసిన ప్రభుత్వం, ఈ ప్రజలకు ఏం పరిహారం ఇస్తుంది? ఎక్కడ నుంచి ఇస్తుంది? ఇది పూర్తిగా మోసమని విమర్శించారు.
మూసీ శుద్ధికైనా, గాంధీ సరోవర్ ప్రాజెక్టుకైనా, గాంధీ విగ్రహం 100 మీటర్లు ఏర్పాటుకైనా మాకు అభ్యంతరం లేదని, కానీ ప్రజల ఇళ్లు కూల్చితే మాత్రం భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. సర్కారు ప్రజల ఇళ్లపై దాడి చేస్తే, బీజేపీ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుందని స్పష్టం చేశారు. గాంధీ సరోవర్ పేరిట రాష్ట్ర ప్రభు త్వం రూ. 4 వేల కోట్లు ఏడీబీ బ్యాంకు ను ంచి లోను తీసుకుంటుందని, పిల్లలకు ఫీజులకు డబ్బులు లేవు కానీ గాంధీ సరోవర్ పార్కు కోసం రుణాలు తీసు కుం టుందని విమర్శించారు.
గుజరాత్‌లో సర్దార్ వల్లభభాయ్ పటేల్ విగ్రహం పెట్టినప్పుడు ఒక్క ఇళ్లు కూడా కూలగొట్టలేదని, అక్కడ ప్లానింగ్‌ను శాస్త్రీయ పద్ధతిలో చేశారని గుర్తు చేశారు. కానీ హైదరాబాద్‌లో ప ర్యాటకులను ఆకర్షించేందుకు సెంటర్ అవసరం లేదన్నారు. మూసీని శుభ్రం చేయాలి.. కానీ ఈ ప్రాజెక్టు అవసరం లేదన్నారు.




