పెట్టుబడులకు సైబర్‌క్రైమ్ అడ్డు!
- దేశంలోనే అత్యధిక సైబర్ నేరాల రాష్ట్రంగా తెలంగాణ
- 2025లో దేశవ్యాప్తంగా నమోదైన ఆర్థిక నేరాల్లో 44 శాతం
- పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రాల జాబితాలో 13వ స్థానం
- ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ నివేదికలో నీతి ఆయోగ్
హైదరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి): అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుని నోట్లో శని చం దంగా తెలంగాణలో పెట్టుబడులకు ప్రతికూల పరిస్థితి తయారయ్యింది. దీనికి తెలంగాణలో సైబర్ నేరాలు(Cyber crimes), ఆర్థిక నేరాలు(financial crimes) తీవ్రంగా పెరుగుతుండటమే ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ కా రణంగానే తెలంగాణలో పెట్టుబడులకు ప్రతికూ ల పరిస్థితులు ఉన్నాయని.. అందుకే దేశ వ్యాప్తం గా పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ దిగువకు పడిపోతున్నది.
ఈ రకమైన రాష్ట్రాల జాబితాలో 13వ స్థానంలో తెలంగాణ నిలిచింది. దేశంలోనే సైబర్ నేరాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని, 2025లో దేశవ్యాప్తంగా నమోదైన ఆర్థిక నేరాల్లో 44 శాతం రాష్ట్రానిదే. ఇది వేరెవరో చెప్పింది కాదు.. సాక్షా త్తు నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన నివేదికలో తేటతెల్లం చేసింది. దీనితో అందరి దృష్టి తెలంగాణలో సైబర్ క్రైంలపై పడింది. 2026 సంవత్సరానికి సంబంధించి పెట్టుబడులకు అ నుకూల సూచీ (ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇం డెక్స్) నివేదికను తాజాగా నీతి ఆయోగ్(NITI Aayog,) విడుదల చేసింది.
ఇందులో 2047 వికసిత్ భారత్‌ను దృష్టిలో పెట్టుకుని దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పెట్టుబడులను ఆకర్షించేలా, అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తున్న ట్టు, భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్టు నివేదికలో పేర్కొన్నారు. పెట్టుబడుల అనుకూల సూచీని నిర్ధారించేందుకు 8 ముఖ్యమైన అంశాలను గుర్తించామని, అందులో మౌలిక వసతు లు, వ్యాపార వాతావరణం, వనరులు, ప్రభుత్వ పాలసీ, సులుభమైన నియంత్రణ, ఆర్థిక సమృ ద్ధి, వ్యవస్థాపరమైన వాతావరణం, పర్యావరణ సానుకూలత లాంటివి ఉన్నాయి.
సర్వేలో భాగం గా వివిధ వ్యాపార, వాణిజ్య, పెట్టుబడి, పారిశ్రామిక వర్గాల నుంచి అభిప్రాయాలను కూడా సేకరించారు. దేశంలోని 17 రాష్ట్రాలను పెద్ద రా ష్ట్రాల కేటగిరీలో, 7 కేంద్ర పాలిత ప్రాంతాల ను మరో కేటగిరీలో, కొండ, ఈశాన్య ప్రాంతాలను మరో కేటగిరీ కింద అధ్యయనం చేశారు. పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒక రాష్ట్రంగా ఉంది. మొత్తం 17 పెద్ద రాష్ట్రాలు ఉండగా.. ఇందులో తెలంగాణ 10వ స్థానంలో ఉండటం గమనార్హం.
పెట్టుబడులకు అనుకూలమైన పెద్ద రాష్ట్రాల్లో గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడుతోపా టు కేంద్ర పాలిత ప్రాంతమైన గోవా కూడా టా ప్ 5 స్థానాల్లో ఉండటం గమనార్హం. వీటన్నింటినీ టాప్ పెర్ఫార్మర్స్‌గా నీతి ఆయోగ్ పేర్కొంది. ఇక ముందుకు సాగుతున్న (ఫ్రంట్ రన్నర్) రా ష్ట్రాల్లో ఏపీ, అసోం, చండీగఢ్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, కేరళం, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, త్రిపుర, ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్ ఉన్నాయి.
దేశంలోని పెద్ద రాష్ట్రాల జాబితాలో టాప్‌లో గుజరాత్ 56.6 స్కోర్‌తో ఉండగా.. 47.3 స్కోర్‌తో 10వ స్థానం లో తెలంగాణ ఉంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంశంలో తెలంగాణ పెద్ద రాష్ట్రాల జాబితాలో 14వ స్థానం లో నిలిచింది. మొత్తం ఎనిమిది పిల్లర్ల లాంటి అంశాలను పేర్కొనగా.. కొన్నింటిలో ఫరవాలేద నే స్థాయిలోనే తెలంగాణ స్కోర్ చేసింది.
అయితే వ్యవస్థాపరమైన వాతావరణం (ఇన్‌స్టిట్యూషన ల్ ఎన్విరాన్‌మెంట్) అంశంలో మాత్రం 17 పెద్ద రాష్ట్రాల కేటగిరీలో 17వ స్థానంలో నిలవడం గమనార్హం. ఇందులో ఛత్తీస్‌గఢ్ అగ్రస్థానంలో ఉన్నది. ఓవరాల్‌గా చూసుకుంటే.. దేశంలోని అన్ని కేటగిరీలను కలిపి చూస్తే.. తెలంగాణ 13 స్థానంలో నిలిచింది.
సైబర్ నేరాలే ప్రధాన అడ్డంకి..
నీతి ఆయోగ్ విడుదల చేసిన ఈ పెట్టుబడుల అనుకూలత సూచీ నివేదికలో సైబర్ నేరాలనే ప్రధాన అడ్డంకి అని, ఈ అంశంలో మరింత పు రోగతి సాధించాల్సిన అవసరం ఉందని కేవలం తెలంగాణ విషయంలోనే స్పష్టం చేయడం ఇక్కడ గమనించాల్సిన అంశం. తెలంగాణతోపా టు సైబర్ క్రైంల అదుపులో మరింత పురోగతి సాధించాలని సూచించిన మరో రాష్ట్రం మహారాష్ట్ర మాత్రమే. కేంద్ర పాలిత ప్రాంతాల విషయ ంలో చండీఘడ్ విషయంలో క్రైం రేటు ఎక్కువగా ఉందని, ఆర్థిక నేరాలపై దృష్టి సారించాల్సి ఉందని నీతి ఆయోగ్ చెప్పింది.
ఢిల్లీ విషయానికి వచ్చేసరికి క్రైం రేటుతోపాటు.. గాలి నాణ్యత (ఏయిర్ క్వాలిటీ ఇండెక్స్) విషయంలో మరింత పురోగతి సాధించాల్సిన అవసరాన్ని నీతి ఆయో గ్ ఉద్ఘాటించింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం విషయంలో కొండ చరియలు ఎక్కువగా విరిగిపడు తున్నాయని దీనిపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. సైబర్ నేరా ల్లో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానం వాస్తవానికి దేశ వ్యాప్తంగా పరిశీలిస్తే.. తెలుగు రాష్ట్రాల్లో.. ముఖ్యంగా తెలంగాణలో సైబర్ నేరాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్టు గణాంకాలు చె బుతున్నాయి.
2025లో తెలంగాణ రాష్ట్రంలో సైబర్ నేరాల వల్ల రూ. 1,524 కోట్ల ఆర్థిక నష్టం నమోదయ్యింది. అయితే 2024తో పోల్చుకుం టే ఆర్థిక నష్టాల్లో సుమారు 20 శాతం తగ్గుదల నమోదయ్యింది. దేశ వ్యాప్తంగా చూసుకుంటే 2025లో 49,620 సైబర్ నేరాలపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఇందులో ఒక్క తెలంగా ణ రాష్ట్రంలోనే 21,639 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కావడం గమనార్హం.
దేశ వ్యాప్తంగా నమోదైన సైబర్ క్రైం ఎఫ్‌ఐఆర్‌లలో 44 శాతం కేవలం తెలంగాణ నుంచే ఉండటాన్ని ఇక్కడ గమనించవచ్చు. అయితే పోలీసువర్గాలు మాత్రం.. ప్రజ ల్లో సైబర్ నేరాల పట్ల అవగాహన పెరగడం, అలాగే.. సైబర్ నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని.. అందుకే ఎఫ్‌ఐఆర్‌ల సంఖ్యలో గణనీయంగా మన రాష్ట్రానివే కనపడతాయని అంటున్నారు.
ప్రతి నాలుగు నేరాల్లో ఒకటి సైబర్ క్రైమ్
రాష్ట్రంలో 2025లో మొత్తం 86,177 కేసుల కు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లు ఉండగా.. ఇం దులో 21,639 ఎఫ్‌ఐఆర్‌లు సైబర్ క్రైంలకు చెందినవే ఉన్నాయి. అంటే ప్రతి నాలుగు నేరా ల్లో ఒకటి సైబర్ క్రైంకు సంబంధించినదే ఉన్నట్టుగా అర్థమవుతోంది. ఇతర నేరాల వల్ల రూ. 207 కోట్ల ఆర్థిక నష్టం జరగ్గా.. సైబర్ నేరాల వల్ల రూ.1524 కోట్ల నష్టం సంభవించింది. సైబర్ క్రైం, ఆర్థిక నేరాల విషయంలో ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించి, వీటిని అడ్డుకునేలా మరింత అత్యాధునిక సాంకేతిక వ్యవస్థల అవసరం ఎంతైనా ఉంది.






