సీఎం రేవంత్‌రెడ్డితో మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి భేటీ
03-05-2024 12:16 AM
హైదరాబాద్, మే2 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాసు మున్షీ, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తదిరులు సీఎం నివాసానికి వెళ్లారు. అనంతరం రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై నేతలు చర్చించుకున్నట్లు తెలిసింది. కాగా, ఇంద్రకరణ్ రెడ్డి బుధవారం బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసి దీపాదాసు మున్షీ నేతృత్వంలో కాంగ్రెస్‌లో చేరిన విషయం
తెలిసిందే.




