3 April, 2026 | 9:04 AM

4న రాజ్యాంగ రక్షణ దీక్ష

03-05-2024 12:19 AM

జహీరాబాద్, ఏప్రిల్ 2 : ఈ నెల 4న హైదరాబాద్‌లో చేపట్టే రాజ్యాంగ రక్షణ దీక్షను విజయ వంతం చేయాలని మాజీ మంత్రి, జహీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి, రాజ్యాంగ పరిరక్షణ సభ్యుడు డాక్టర్ చంద్రశేఖర్ కోరారు. గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి రాజ్యాంగ రక్షణ దీక్షపై చర్చించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసేందుకు కుట్ర పన్నుతున్నందుకు నిరసనగా దీక్షను చేపడు తున్నామని సీఎంతో వివరించారు. ఈ దీక్షకు సహకరించాలని కోరగా అందు కు సీఎం సానుకూలంగా స్పందించారన్నారు. హైదరాబాద్‌లోని సెక్రటేరి యట్ పక్కన ఉన్న 125అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ రక్షణ దీక్షను ఈ నెల 4న చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ దీక్షకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజానీకం వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు గజ్జెల కాంతం, సతీష్ మాదిగా తదితరులు పాల్గొన్నారు.