కరీంనగర్ కలలు తీరేదెప్పుడు?
మంజూరైనా పట్టాలెక్కని ప్రాజెక్టులు
నెల్లూరుకు తరలిపోయిన లెథర్ పార్క్
ఎవరికీ పట్టని నేదునూర్ గ్యాస్ విద్యుత్ ప్లాంట్
ఇప్పటికీ కలగానే ట్రిపుల్ ఐటీ
కరీంనగర్, మే2 (విజయ క్రాంతి): తెలంగాణ సాధించుకున్నాం.. ప్రభుత్వాలు మారా యి.. అయినా కరీంనగర్ ప్రజల చిరకాల స్వప్నాలు మాత్రం సాకారం కావడం లేదు. ఎన్నికల సమయంలో పార్టీలు, నేతలు హామీలు ఇవ్వడం, అట్టహాసం చేయడంతోనే సరిపోతుంది. అధికారంలోకి వచ్చాక ఆచరణలోకి తేవడంలో నిర్లక్ష్యం వల్ల చివరకి నిరా శే మిగులుతోంది. రాష్ట్ర విభజనకు ముందు నుంచి ఇదే తంతు నడుస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా కు నేదునూరు గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రా జెక్టు, లెథర్ పార్కు, ట్రిపుల్ ఐటీ వచ్చినట్టే వచ్చి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయాయి.
గ్యాస్ విద్యుత్ ప్లాంట్
2,100 మెగావాట్ల సామర్థ్యంతో గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టుకు తిమ్మాపూర్ మండలం నేదునూరులో ఉమ్మడి రాష్ట్రంలోని అప్పటి సీఎం రోశయ్య 2011లో శంకు స్థాపన చేశారు. ఇందుకు 434 ఎకరాల భూసేకరణ కూడా పూర్తిచేశారు. మూడు విడతలుగా 700 మెగావాట్ల చొప్పున ప్రాజెక్టును పూర్తిచేయాలని సంకల్పించారు. రూ. 5,600 కోటతో 30 నెలల్లో పనులు పూర్తిచేసేలా జెన్‌కోకు ప్రాజెక్టును అప్పగించారు. అయితే కేంద్రం శంకరంపల్లితోపాటు నేదునూరు ప్రాజెక్టుకు గ్యాస్ కేటాయింపులో నిర్లక్ష్యం వహించడంతో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్‌ఎస్ నేదునూరు శిలాఫల కం వద్ద అనేకమార్లు ఆందోళన నిర్వహించింది. తెలంగాణకు రావలసిన ప్రాజెక్టును కేంద్రం అడ్డుకుంటుందని విమర్శలు చేసిం ది. తెలంగాణ రాగానే నేదునూరును సాధిం చి తీరుతామని బీఆర్‌ఎస్ నేతలు శపథం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువా త నేదునూరు అంశం గురించి పట్టించుకోకపోవడంతో ఈ ప్రాజెక్టుపై ప్రజల్లో నెలకొన్న ఆశలు సన్నగిల్లాయి. ఇక్కడి ప్రజలు ఈ స్థలంలో యువతకు ఉపాధి కల్పించే మరేదైన పరిశ్రమ కావాలని కోరుతున్నారు.
నెల్లూరుకు తరలిన లెథర్ పార్కు
కరీంనగర్‌కు ఇచ్చిన అతిముఖ్యమైన హామీల్లో మరొకటి లెథర్ పార్కు. చెన్నమనేని విద్యాసాగర్‌రావు కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజవర్గ పరిధిలోని రుక్మాపూర్‌లో లెథర్ పార్కు నిర్మించాలనే ప్రతిపాదన వచ్చింది. విద్యాసాగర్‌రావు కూడా ఇందుకు ప్రయత్నించారు. కేంద్రం నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చినట్లే వచ్చి నిలిచిపోయింది. కరీంనగర్‌కు రావలసిన ఈ పార్కును అప్పటి మరో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు నెల్లూరుకు -తరలించుకుపోయారు.
కాంగ్రెస్ ఈ లెథర్ పార్కుకోసం పోరా టం చేసి చివరకు మినీ లెథర్ పార్కు నిర్మించాలని సంకల్పించింది. కానీ పనులు మొదలు పెట్టలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఈ సార్కు కోసం దళితులు పోరాటం చేశారు. బీఆర్‌ఎస్ నేతలతోపాటు 2014లో అప్పటి ఎంపీ వినోద్‌కుమార్ కూడా హామీ ఇచ్చా రు. అయితే రాష్ట్రానికి పార్కు మంజూరైనా అది జనగామకు రావడంతో కరీంనగర్ ప్రజలకు నిరాశే మిగి లింది. నేటికీ ఈ విషయంలో ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో నేతలు హామీ లు ఇస్తూనే ఉన్నారు.
కలగానే ట్రిపుల్ ఐటీ
రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణ కు ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. ఈ సంస్థను కరీంనగర్ జిల్లాకు రావలసి ఉండగా నేటి కీ కలగానే మిగిలింది. గతంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలసిన అప్పటి -రాష్ట్ర సీఎం కేసీఆర్ విజభజ హామీల్లో ట్రిపుల్ ఐటీ ఆవశ్యకతను వివరించారు. దీనికి సానుకూల స్పం దన రావడంతో ఆశలు చిగురించా యి. విద్యార్థులు కేంద్ర ప్రకటన కోసం గత పదేళ్లుగా ఎదురు చూస్తున్నారు. ట్రిపుల్ ఐటీ ఏర్పాటయితే పదోతరగతి పాసైన విద్యార్థులు ఇంటర్ సంబంధం లేకుండా ఆరు సంవత్సరాల ఇంజినీరింగ్ కోర్సును చేసే అవకాశాలు లభిస్తాయి. ట్రిపుల్ ఐటీలో చదివిన విద్యార్థులకు దేశ, విదేశాల్లో మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. మన నేతలు కేంద్రంపై ఒత్తిడి పెంచితేనే దీన్ని సాధించుకోగలమని విద్యావేత్తలు అంటున్నారు.




