18 April, 2026 | 6:35 AM

బొడ్రాయి పండుగలో పాల్గొన్న మాజీ మంత్రి

31-05-2025 08:06 PM

జడ్చర్ల: మిడ్జిల్ మండలంలోని కంచనపల్లి గ్రామంలో నిర్వహించిన బొడ్రాయి పండుగ మహోత్సవ వేడుకలకు మాజీ మంత్రి శ్రీ లక్ష్మారెడ్డి(Former Minister Sri Lakshma Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీమంత్రి ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ... ప్రతి ఒక్కరు సుఖసంతోషాలతో జీవనం గడపాలని కోరారు. దైవ అనుగ్రహం అందరిపై ఉండాలని పేర్కొన్నారు. ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉండి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగుతారని తెలియజేశారు. ఐక్యమత్యంతో కలిసిమెలిసి వేడుకలను సంతోషంగా నిర్వహించుకోవాలని సూచించారు. ఈ వేడుకల్లో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పి వైస్ చైర్మన్ కోడుగల్ యాదయ్య, తదితరులు ఉన్నారు.