మాజీ మంత్రి తలసాని సోదరుడు మృతి
నివాళులర్పించిన పలువురు నాయకులు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 10 (విజయక్రాంతి) : మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీని వాస్‌యాదవ్ ఇంట విషాదం నెల కొంది. ఆయన సోదరుడు తలసాని శంకర్ యాదవ్(61) మృతి చెందారు. గతకొద్ది రోజులుగా అనా రోగ్యంతో బాధపడుతున్న శంకర్ యాదవ్ సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్ల వారు జామున తుదిశ్వాస విడిచారు. తన సోద రుడి పార్థివదేహం చూసి తలసాని శ్రీనివా స్‌యాదవ్ కన్నీటి పర్యంతమయ్యారు. శంకర్ యాదవ్ ప్రస్తుతం మోండా మార్కెట్ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు.
గతంలో బోయిన్‌పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడిగానూ పనిచేశారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న మోండా మార్కెట్, బో యిన్‌పల్లి మార్కెట్ వ్యాపారులు, నాయ కులు, స్థానికులు మారేడ్‌పల్లిలోని ఆయన నివాసానికి పెద్ద ఎత్తున చేరుకొని నివా ళులర్పించారు. శంకర్ యాదవ్ మృతిపట్ల బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన భౌతిక కాయానికి మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మహముద్ అలీ, పద్మారా వు గౌడ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, శ్రీగణేష్, సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ తదితరులు నివాళులర్పించారు.






