హైదరాబాద్ సీపీగా సజ్జనార్?
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 10 (విజయక్రాంతి): హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా వీసీ సజ్జనార్‌ను నియమించే అవకాశం ఉం దని విశ్వసనీయ సమాచారం. అతి త్వరలోనే నగర కొత్వాల్‌పై ప్రభుత్వ అధికారవర్గాలు నిర్ణయాన్ని ప్రకటిం చే అవకాశం ఉంది. దీంతోపాటు సైబరాబాద్, రాచకొండ సీపీలు కూ డా మారే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ సీపీ గా ఉన్న కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డికి డీజీగా పదోన్నతి రానుంది. వీసీ సజ్జనార్ 1996 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఈయన ప్రస్తుతం అదనపు డీజీపీ హోదాలో టీజీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా కొన సాగుతున్నారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. 2008 వరంగల్ యాసిడ్ దాడి కేసులో, 2019 శంషాబాద్ దిశ ఎన్‌కౌంటర్‌లు సజ్జనార్‌ను వార్తల్లో నిలి చేలా చేశాయి. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న మహిళలకు ఉచిత బస్సు స్కీం పటిష్టంగా అమలు చేయడంలో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ పోలీ సు కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణకు వీసీ సజ్జనార్ సేవలు అవసరమని ప్రభుత్వం భావిస్తుండటంతో ఆయనకే హైదరాబాద్ సీపీగా బాధ్యతలు అప్పగించేందుకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.






