calender_icon.png 22 February, 2026 | 7:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాంకేతిక వ్యవసాయంతో మంచి లాభాలు

22-02-2026 01:58:16 AM

రైతు బడి అగ్రి షోలో మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

ముషీరాబాద్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకొని వ్యవసాయం చేస్తే లాభసాటిగా మంచి లాభాలు పొందే అవకాశం ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. మారుతున్న కాలానికనుగుణంగా వస్తున్న యాంత్రిక పరికరాలను ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో రైతుబడి ఆగ్రిషో రెండోరోజు కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు హాజరై వివిధ స్టాళ్లను సందర్శించి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపట్టాల్సిన కార్యక్రమాన్ని రాజేందర్‌రెడ్డి చేపట్టడం అభినందనీయమన్నారు. వ్యవసాయ రం గాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సి ఉండగా రాజేందర్‌రెడ్డి అనే వ్యక్తి ఎన్టీఆర్ స్టేడియంలో రైతులంరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.