calender_icon.png 19 July, 2025 | 2:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరకాగూడెం తరలి వెళ్లిన మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు

18-07-2025 11:03:33 PM

కేటీఆర్ కు ఘన స్వాగతం పలికిన నాయకులు వనమా రాఘవ

రేగా కాంతారావు పరామర్శించిన వనమా

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ప్రభుత్వ మాజీ చీప్ విప్ రేగా కాంతారావు తల్లి నరసమ్మ దశదినకర్మలలో పాల్గొనేందుకు  మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు పినపాక మండలంలోని కరకగూడెం గ్రామానికి తరలి వెళ్లారు. శుక్రవారం పాల్వంచలోని వనమా వెంకటేశ్వరావు స్వగృహం నుండి  వనమా రాఘవేంద్రరావ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలతొ కలిసి వెళ్లారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కరకగూడెం వచ్చిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు ఆ గ్రామంలో మాజీ మంత్రి వనమా ఘన స్వాగతం పలికారు. అలాగే కేటీఆర్ మాజీ మంత్రి వనమా ను చూసి ఏం పెద్దాయన అంటూ పలకనించారు. అలాగే జిల్లాలో పార్టీ కి సంబంధించిన విషయాలను కూడా అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్ తో కలిసి రేగా కాంతారావును పరామర్శించి మనో ధైర్యాన్ని కల్పించారు. తొలుత కాంతారావు  తల్లి నరసమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వనమాతోపాటు బిఆర్ఏఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, ఆ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.