19-07-2025 12:00:00 AM
మర్కుక్ లో అభివృద్ధి పనులను పాఠశాలలను పరిశీలించిన కలెక్టర్ హైమావతి
గజ్వేల్, జులై 18 : ప్రభుత్వ నిబంధన మేరకు 600 అడుగుల్లో ఇంద్రమ్మ ఇండ్లను పూర్తిచేసిన లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని అధికారులను కలెక్టర్ హైమావతి ఆదేశించారు. మర్కుక్ మండల కేంద్రంలో శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలును ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, తహశీల్దార్ కార్యాలయం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఇందిరమ్మ గృహాల నిర్మాణం త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. ‘600 చదరపు అడుగుల కింద నిర్మాణం పూర్తిచేసిన లబ్ధిదారులకు వెంటనే వారి ఖాతాల్లో నిధులు జమ అవుతాయని వారం చివరలో రిపోర్ట్ చేస్తే ప్రతి సోమవారం డబ్బులు జమ చేస్తామని ఆమె తెలిపారు. కార్యక్రమంలో తహశీల్దార్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఎంపీడీవో అశోక్ కుమార్, ఎస్త్స్ర దామోదర్, మండల విద్యాధికారి వెంకటరాములు, ఆర్‌ఐ శ్రీధర్, పంచాయతీ కార్యదర్శి శాంతి, మిషన్ భగీరథ ఏఈ భానుప్రియ ఇతర అధికారులు పాల్గొన్నారు.