పరిగి పర్యటనకు బ్రేక్ — మాజీ మంత్రులు హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డి హౌస్ అరెస్ట్
హైదరాబాద్: వికారాబాద్ జిల్లా పరిగి వెళ్లకుండా బీఆర్ఎస్ నేతలపై ఆంక్షలు విధించారు. పరిగి వెళ్లకుండా మాజీ మంత్రి హరీశ్ రావును(Former Ministers Harish Rao) పోలీసులు హౌస్ అరెస్ట్(House Arrest) చేశారు. ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను కలిసేందుకు హరీశ్ రావు పరిగి పర్యటనకు ప్లాన్ చేశారు. హరీశ్ రావు నివాసం వద్ద భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి.
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy House Arrest), పలువురు ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల నేతల గృహ నిర్బంధం చేశారు. పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు కొడంగల్ నియోజకవర్గం బొంరాస్ పేట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటులో 1200 ఎకరాల భూములు కోల్పోతున్న బాధితులకు అండగా నిలిచేందుకు వెళ్తున్న హరీష్ రావును అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఈ అరెస్టులు జరిగాయి.




