హింసకు కేరాఫ్ కేసీఆర్ కుటుంబం
- హరీశ్‌రావుకు రక్తం చిందించే ధైర్యం లేదు
- సిద్దిపేటలో అధిష్ఠానం పోటీ చేయమంటే నేను రెఢీ
- తుంగతుర్తిది అన్నదమ్మల పంచాయితీ
- పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి): హింసకు కేరాఫ్ అడ్రస్ కేసీఆర్ కుటుంబమని టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు. రెచ్చగొట్టే మాటలతో ఆత్మహత్యలు చేసుకునేది కేసీఆర్ కుటుంబం వల్లే నని ఆయన మండిప డ్డారు. రక్తం చిందించే ధైర్యం హరీశ్‌రావుకు లేదని, తెలంగాణ ఉ ద్యమంలో పెట్రోలు పోసుకుని, అగ్గిపెట్టే తెచ్చుకోవడం మర్చిపోయిన వ్యక్తి అని జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. ఆత్మహత్యలు చేసుకునే లా రెచ్చగొట్టే స్వభావం హరీశ్ రావుద న్నా రు.
ఆదివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. మాట నిలబెట్టుకోవ డం కాంగ్రెస్ సంస్కృతి అయితే మాట నిలబెట్టుకోలేని సంస్కృతి బీఆర్‌ఎస్ పార్టీద న్నారు. హరీశ్‌రావు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని విమర్శిం చడాన్ని పనిగా పెట్టుకున్నా రని, ఉద్యమ సమయంలో మీరు ఇచ్చిన స్పీచ్‌లకు తెలంగాణ యువకులు బలయ్యారని అన్నారు.
పెట్రోల్ పోసుకున్న హరీశ్ అగ్గిపెట్టే మర్చిపోయారని, దాన్నిబట్టి చూస్తే హరీశ్ సాహసమేంటో కాంగ్రెస్‌కు తెలుసని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. డబ్బులు తీసుకున్నప్పుడు ఈటల మాట్లాడటం సహజమేన ని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్‌తో ఈటల రాజేందర్‌కు బంధం ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీజేపీ ఎంపీగా ఎన్డీఎస్‌ఏతో ఈటల రాజేందర్ మాట్లాడాలని, వారితో చర్చించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ సిద్ధంగా ఉన్నారని చెప్పా రు.
లక్ష కోట్ల ప్రజాధనం వృథా చేసి.. కాళేశ్వరం కూలడానికి కారణమైన కేసీఆర్, హరీశ్‌రావు ముందు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి మెదక్‌లో మెజారిటీ సీట్లు కాంగ్రెస్ గెలవబోతోందని, సిద్దిపేటలో పోటీ చేయాలని అధిష్ఠానం ఆదేశిస్తే పోటీ చేస్తానన్నారు. తుంగతుర్తి అంశం అన్నదమ్ముల లాంటి దని, కోపాలు, తాపాలుంటాయని, అందరి అభిప్రాయలతో సెట్‌చేస్తామని చెప్పారు. నివేదికను అధిష్ఠానానికి ఇస్తామని, మొదట ఎమ్మెల్యేకు ఆ తర్వాత ఎంపీకి, డీసీసీకి ప్రాధాన్యం ఉంటుందని అన్నారు.






