3 August, 2026 | 2:35 AM

బోనం ఎత్తిన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి..

03-08-2026 12:45 AM

బాన్సువాడ, ఆగస్టు 2 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోనీ రుద్రూర్ మైసమ్మ ఆలయంలో నిర్వహించిన ఆషాఢ బోనాల వేడుకలు ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అమ్మవారికి బోనం ఎత్తి మొక్కులు చెల్లించుకున్నారు.

అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులతో కలిసి బోనాల ఉత్సవాల్లో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.