10 August, 2026 | 10:00 AM

పోచారం తాండా తీజ్ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్

10-08-2026 08:54 AM

బాన్సువాడ, (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని పోచారం తండాలో ఆదివారం రోజున తీజ్ ఉత్సవాలను బంజారా (లంబాడీలు) లు తీజ్ ఉత్సవాలను కన్నుల పండుగగా ఘనంగా జరుపుకున్నారు. ఈ ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఇంచార్జ్ బాజిరెడ్డి గోవర్ధన్, నాయకులు మోరిల్ శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తీజ్ అనేది ప్రధానంగా మహిళలు నిష్టతో ఉపవాస దీక్షలు చేపట్టి, ప్రధానంగా జరుపుకునే పండుగల్లో ఒకటన్నారు. వివాహిత మహిళలు భర్త క్షేమం కోసం ఉపవాసాలు పూజలు చేస్తారన్నారు. పార్వతి దేవి శివున్ని కలవడానికి సూచిస్తారన్నారు. ఈ సందర్భంగా శివ పార్వతులను భక్తిశ్రద్ధలతో పూజిస్తారని మహిళలు కొత్త చీరలు, పచ్చని గాజులు ధరించి చేతులకు మెహందీ పెట్టుకుంటారన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రకృతి పచ్చగా మారే సమయంలో తీజ్ పండుగను కోలాహాలంగా,ఉత్సాహంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.