30 July, 2026 | 8:15 PM

మోరంచవాగు ఉద్ధృతిని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర

30-07-2026 07:12 PM

భూపాలపల్లి,(విజయక్రాంతి): మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి గణపురం మండలం చెల్పూర్ గ్రామాల మధ్యనున్న మోరంచవాగు భారీ వర్షాల కారణంగా ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అక్కడికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా వాగు ప్రవాహాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన ఆయన స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాగులు, చెరువులు, లోతట్టు ప్రాంతాల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తూ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆయన కోరారు.