calender_icon.png 13 September, 2025 | 8:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీపీ, మాజీ సర్పంచ్..

13-09-2025 05:10:43 PM

కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

కోనరావుపేట (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల మాజీ ఎంపీపీ, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు అబ్బాసాని శంకర్ గౌడ్, మర్రిమడ్ల తాజా మాజీ సర్పంచ్ మాట్ల అశోక్, కొలనూరు ఫ్యాక్స్ డైరెక్టర్ ఇప్ప రాములు, మాజీ వార్డు సభ్యులు శంకరవ్వ, బొడ్డు కిషన్ లతో పాటు సుమారు 20 మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వారికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Whip Aadi Srinivas) కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగిందని తెలిపారు. 

బిఆర్ఎస్ పార్టీ పాలనలో తమకు సరైన గుర్తింపు లేదని, బీసీ బిడ్డ అయినా ఆది శ్రీనివాస్ అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వేములవాడ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతున్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో పనిచేస్తామని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ముందుకు పోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా, మార్కెట్ కమిటీ అధ్యక్షులు కచ్చకాయల ఎల్లయ్య, ఉపాధ్యక్షులు తాల్లపెల్లి ప్రభాకర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మందాల లింబయ్య, మ్యాకల ప్రభాకర్ రెడ్డి, వెంగళి వెంకటేష్, ప్రభాకర్ రెడ్డి,కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు కేతిరెడ్డి జగన్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చందనగిరి గోపాల్, గొట్టే రుక్మిణి, నాలుక సత్యం,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.