13-09-2025 05:11:11 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి షెడ్యూలు కులాల బాలుర వసతి గృహాన్ని శనివారం మంచిర్యాల జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు సిహెచ్ దుర్గాప్రసాద్ పరిశీలించారు. విద్యార్థులకు వండుతున్న భోజనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.వసతి గృహంలో కల్పిస్తున్న సౌకర్యాలను కళాశాలల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వసతి గృహంలో విద్యార్థులు, పోషకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు సమయపాలన పాటిస్తూ కాలాన్ని వృధా చేయకుండా విద్యా సంబంధిత విషయాలపై దృష్టి పెట్టాలని కోరారు. క్రమశిక్షణతో, నిరంతర పరిశ్రమతో ముందుకు సాగాలని కోరారు. ఇందుకోసం విద్యార్థులు, తల్లిదండ్రులు, వసతి గృహ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విద్యార్థులు ఎలాంటి దురలవాట్లు అలవర్చుకోవద్దని, సెల్ ఫోన్ తో సమయాన్ని వృధా చేసుకోవద్దని సూచించారు.