calender_icon.png 13 September, 2025 | 7:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భీమేశ్వరాలయనికి వచ్చే భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి

13-09-2025 05:09:00 PM

వేములవాడ టౌన్,(విజయక్రాంతి): రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధమైన భీమేశ్వరాలయనికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా మాట్లాడుతూ... వివిధ ప్రాంతాల నుండి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రతా చర్యలు పటిష్టం చేయాలని,వివిధ ప్రాంతాల నుండి వచ్చే వాహనాలకు ట్రాఫిక్ సమస్యలు రాకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.

అనంతరం ఆలయ ప్రాంగణంలో క్యూ లైన్స్, విఐపి దర్శనం, కోడె మొక్కుల దర్శనం,వీఐపీ రోడ్డు, పార్కింగ్ స్థలాలు, భక్తుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించి భక్తుల రాకపోకలు సాఫీగా జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎస్పీ వెంట పట్టణ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్,ట్రాఫిక్  ఆర్.ఎస్.ఐ రాజు , ఈఈ రాజేష్, డీఈ మైపాల్ రెడ్డి, ఏఈఓ శ్రావణ్ కుమార్, ఏఈ నాగరాజ్, ఆలయ ఇన్స్పెక్టర్ రాజేశ్వర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.