9 April, 2026 | 2:16 AM

మాజీ ఎంపీటీసీ గుండెపోటుతో మృతి

09-04-2026 12:14 AM

బెజ్జంకి, ఏప్రిల్ 8: సిద్దిపేట జిల్లా బెజ్జంకి తోటపల్లి గ్రామానికి చెందిన తాజా మాజీ బీఆర్‌ఎస్ ఎంపీటీసీ సభ్యురాలు నల్లగొండ లక్ష్మి బుధవారం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించినప్పటికీ మార్గ మద్యంలో కన్నుమూశారు.

ఎంపీటీసీగా ఉన్న సమయంలో గ్రామ అభివృద్ధికి కృషి చేశారు. ఇటీవల జరిగిన గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో కూడా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రజాసేవకు అంకితభావంతో పనిచేసిన నాయకురాలిగా గుర్తింపు పొందా రు. ఆమె మృతితో తోటపల్లి గ్రామంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది.