ప్రజాపాలన దరఖాస్తుల గల్లంతు?
- ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తు కెళ్ళితే ప్రజా పాలన దరఖాస్తు లేదు
- ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నామని లబ్ధిదారుల ఆవేదన
- ఎంపీడీవో దగ్గరికి వెళ్లి విచారిస్తే రుస రుసలు
- ఆన్‌లైన్ పోర్టర్‌లో కనిపించని దరఖాస్తులు లబ్ధిదారుల ఆందోళన
- పట్టించుకోని ఎంపీడీవో
బిచ్కుంద, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): గత రెండు సంవత్సరాల క్రితం రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాల అందించేందుకు ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహించి దరఖాస్తులను స్వీకరించారు. ఎంతోమంది పేదలు తమకు ప్రభుత్వ పథకాలు అందుతాయాన్నే ఎంతో ఆశతో ప్రజాపాలనలో గత రెండు సంవత్సరాల క్రితం దరఖాస్తు చేసుకున్నారు.
ప్రభుత్వ పథకాలు రావడంలేదని అర్హులైన లబ్ధిదారులు కొందరు ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లి తాము దరఖాస్తు చేసుకున్న ప్రజాపాలన దరఖాస్తులు చూపించాలని కోరారు. దీంతో ఎంపీడీవో దరఖాస్తుదారులపై రుస రుసలాడారు. ఎంపీడీవో సమాధానం చెప్పలేక రుస రుస లాడడం చూస్తుంటే ప్రజా పాలన లో దరఖాస్తులు గల్లంతయ్యా అనే అనుమానాన్ని దరఖాస్తుదారులు వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు పొంతన లేని సమాధానాలు చెప్పడం చూస్తుంటే ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వాటిని ఆన్లైన్ పోర్టర్ లో నమోదు చేయలేదేమో అనే అనుమానం వ్యక్తం అవుతుందని పలువురు దరఖాస్తుదారులు విజయక్రాంతి ప్రతినిధి తో తెలిపారు. దరఖాస్తు చేసుకొని రెండు సంవత్సరాలైనా ఆన్లైన్ పోర్టర్ లో నమోదు కాకపోవడం చూస్తుంటే పేదలకు దరఖాస్తులకు అధికారులు ఏ మేరకు శ్రద్ధ తీసుకున్నారో అర్థమవుతుంది.
ఆన్లైన్ పోర్టర్ లో నమోదు చేయడంలో అధికారుల నిర్లక్ష్యం కనబడుతుందని బాధితులు వాపోతున్నారు. తాము దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులు ఆన్లైన్ పోర్టల్ లో చేర్చకపోవడం వల్ల తమకు ప్రభుత్వ ము నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కు అనరులం కావలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల పేర్లు ఆన్లైన్ పోర్టర్లు లో గల్లంతు కావడం ఏమి టనీ ప్రశ్నిస్తున్నారు.
ప్రజాపాలన దరఖాస్తుల గల్లంతుపై విచారణ జరపాలి
గత రెండు సంవత్సరాల క్రితం ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించగా తాము దరఖాస్తు చేసుకున్నామని, ప్రస్తుతం ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకుందామంటే ప్రజా పాలన దరఖాస్తు ఫారం నెంబర్ కావాలంటున్నారని దాని గురించి ఎంపీడీవో కార్యాలయం కు వెళితే ఆన్లైన్ పోర్టల్ లో తమ పేరు లేదని అధికారులను అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదు. ఉన్నతాధికారులు విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. తన పేరు ఆన్లైన్ పోర్టర్ లో నమోదు చేయాలి.
- అబ్దుల్ మహమ్మద్,
చిరు వ్యాపారి, బిచ్కుంద,
కామారెడ్డి జిల్లా




