దాసోహం కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మున్సిపల్ చైర్మన్
09-03-2026 06:38 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణ కార్పెంటర్ అసోసియేషన్ అధ్యక్షులు దాసోహం వెంకటేశ్వర్లు తల్లి ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో వారి కుటుంబ సభ్యులను సోమవారం సుల్తానాబాద్ రెండో వార్డ్ కౌన్సిలర్, మాజీ మున్సిపల్ చైర్మన్ గాజుల లక్ష్మీ రాజమల్లు కలసి పరామర్శించారు. చిత్రపటానికి నివాళి అర్పించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.




