11 March, 2026 | 1:47 AM

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

09-03-2026 06:42 PM

ఎమ్మెల్యే కోవ లక్ష్మికి ఘన సన్మానం

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం రాత్రి ఆసిఫాబాద్ శాసన సభ్యురాలు కోవ లక్ష్మి నివాసంలో వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండి అహ్మద్, కౌన్సిలర్ సాలం బిన్ అహ్మద్ లు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే కోవ లక్ష్మిని శాలువాతో ఘనంగా సత్కరించి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం మహిళా నాయకురాలు, మాజీ సర్పంచ్ మర్సుకోల సరస్వతి, రాజంపేట ఉప సర్పంచ్ మామిడి లక్ష్మిలను కూడా శాలువాలతో ఘనంగా సన్మానించి వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు అహ్మద్ బిన్ అబ్దుల్లా, సయ్యద్ నిసార్, సమద్, అమర్ బిన్ అబ్దుల్లా, సయ్యద్ జావిద్ తో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని, ప్రతి రంగంలోనూ మహిళలు రాణించాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు.