29 April, 2026 | 3:16 AM

మంత్రి సీతక్కను కలిసిన మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్

29-04-2026 01:47 AM

కామారెడ్డి, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో మంత్రి సీతక్క పర్యటనలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కామారెడ్డి మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు తాటి లావణ్య ప్రసాద్, మాజీ కౌన్సిలర్ సలీం, జమిల్, సాయిబాబా, క్రీడా అధ్యక్షులు నర్సాగౌడ్, కాంగ్రెస్ నాయకులు బల్ల శ్రీనివాస్, నవీన్, రాజశేఖర్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.